హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రిని కలిసిన కాంగ్రెస్ ఇంఛార్జ్, మున్సిపల్ ఛైర్మన్

KNR: హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రణవ్ బాబు, ఛైర్ పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు మంత్రి శ్రీధర్ బాబుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రిని కలిసి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.