హైదరాబాద్: 28°C
తెలంగాణ

లారీ బీభత్సం.. రెండు షెడ్లు ధ్వంసం

KNR: అలుగునూరులో ఇవాళ ఉదయం డ్రైవర్ అజాగ్రత్తతో గూడ్స్ లారీ ఇంట్లోకి దూసుకెళ్లింది. రాజీవ్ రహదారి పక్కన ఉన్న ఇంట్లోకి లారీ దూసుకెళ్లడంతో మెకానిక్ కు చెందిన రెండు షెడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో లారీ డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై SI కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.