MDK: రామాయంపేట మండలంలో యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ సూచించారు. ఆన్‌లైన్ యాప్‌లో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందుల వల్లే పంపిణీలో ఆలస్యమవుతోందని ఆయన తెలిపారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, రైతులందరికీ త్వరలోనే యూరియా అందుబాటులోకి వచ్చేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
తెలంగాణ
యూరియా కొరతపై రైతులకు ఏవో భరోసా


