హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గుత్ప లిఫ్ట్ కెనాల్ వద్ద చిరుతల కలకలం!

NZB: ఆలూరు మండలం కల్లెడ గ్రామ శివారులో చిరుతలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోన్నాయి. గుత్ప లిఫ్ట్ కెనాల్ పరిసరాల్లో 5 చిరుత పులులు తిరుగుతున్నట్లు గ్రామస్థులు గుర్తించారు. దీంతో పొలాలకు వెళ్లే రైతులు ఆందోళన చెందుతున్నారు. చిరుతల కదలికలను గుర్తించి, తమకు రక్షణ కల్పించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.