హైదరాబాద్: 28°C
తెలంగాణ

చందంపేటలో బీజేపీ నాయకులు అరెస్ట్!

NLG: నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి, ఇంటిని ధ్వంసం చేసి, వారి తల్లితో సహా కుటుంబ సభ్యులపై భౌతిక దాడికి పాల్పడ్డారు. బాధిత కుటుంబానికి మద్దతుగా నల్గొండకు వెళ్తున్న చందంపేట మండల బీజేపీ నాయకులు వినోదాచారి, బోడ శ్రీశైలం,తదితరులను మార్గం మధ్యలో పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.