AP: శ్రీకాకుళం(D) మందస(M) గెడ్డూరు వద్ద చేపల వేట నుంచి వస్తుండగా బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వంకా యాదవరావు (59) మృతి చెందాడు. ప్రమాద సమయంలో బోటులో ఉన్న మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై MLA గౌతు శిరీష విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు, వారికి తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
మృతుడి కుటుంబానికి తక్షణ సాయం: అచ్చెన్న


