హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురుగు మందు తాగి వ్యక్తి అస్వస్థత

SRD: కంగ్టి మండలం నాగూర్ గ్రామంలో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యాడు. గ్రామానికి చెందిన బసప్ప కుటుంబ కలహాల కారణంగా, క్షణికావేశంతో పురుగుల మందును సేవించాడు. విషయాన్ని కుటుంబీకులు గుర్తించి 108కు సమాచారం అందించారు. సకాలంలో ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ప్రథమ చికిత్సలు చేసి కంగ్టి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.