సహజంగా బరువు తగ్గాలంటే కొన్ని పద్ధతులు పాటించాలని డా.విక్రాంత్ సింగ్ ఠాకూర్ సూచించారు. ప్రతి భోజనంలో ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలి. అన్నం తగ్గించి, కూరలు రెట్టింపు తినాలి. రిఫైండ్ ఆయిల్స్, జంక్ ఫుడ్స్ మానేసి నెయ్యి.. కొబ్బరి నూనె వాడాలి. తగినంత నీరు తాగడం, తిన్నాక 20 నిమిషాలు నడవడం, కంటినిండా నిద్ర, ఒత్తిడి లేని ఆనందకరమైన జీవనశైలితో సులువుగా బరువు తగ్గొచ్చని విక్రాంత్ చెప్పారు.
ఆరోగ్యం
బరువు తగ్గాలా?.. డా.విక్రాంత్ టిప్స్ ఇవే!


