హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి 6 రూట్లలో 24గంటల బస్సులు

HYD: నగరంలో అర్ధరాత్రి వేళల్లో ప్రజా రవాణాకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రాత్రి పూట నైటిషిప్ట్ బస్సు సేవలను ప్రారంభిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఆరు ప్రధాన మార్గాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాత్రివేళ ప్రయాణించే ప్రజలకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడనున్నాయి.