HYD: జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్కు చుట్టూ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జర్నలిస్టు కాలనీ వద్ద డివైడర్ తొలగింపుతో ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ఫ్లైఓవర్, అండర్ పాస్‌ల నిర్మాణాల కారణంగా పార్కు చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధించిన విషయం తెలిసిందే.
తెలంగాణ
కేబీఆర్ పార్కు చుట్టూ భారీగా ట్రాఫిక్ జామ్


