హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలి: AEO

NLG: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే (DCS) కొనసాగుతోంది. రైతులు తమ పొలాల్లో సాగు చేస్తున్న పంటలు, భూమి వివరాలను సర్వే సిబ్బందికి అందించాలని వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) శోభారాణి కోరారు. సిబ్బంది పొలాలకు వచ్చినప్పుడు అవసరమైన సమాచారం అందించి సర్వే ప్రక్రియ పూర్తయ్యేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.