హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేశంపేటలో భక్తిశ్రద్ధలతో చాతుర్మాస్య యజ్ఞం

RR: కేశంపేటలో కిషన్ ప్రభు ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో అనసూయమ్మ నేతృత్వంలో చాతుర్మాస్య యజ్ఞం కొనసాగుతోంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు యజ్ఞం నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుండగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.