హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమృత్ 2.0 పథకం కింద పైపులైన్ పనులు ప్రారంభం

WNP: అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని 3వ వార్డులో అమృత్ 2.0 పథకం కింద తాగునీటి పైపులైన్ పనులు కొనసాగుతున్నాయి. పట్టణంలో శాశ్వత తాగునీటి సరఫరా కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. మంగళవారం వార్డు కౌన్సిలర్ తిరుమలేష్ పైపులైన్ పనులను పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.