SDPT: చేర్యాలలోని అయ్యప్ప, కాశీ విశ్వనాథ, సత్యనారాయణ స్వామి దేవాలయ 9వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం గణపతి పూజ, కలశస్థాపన, పూర్ణాభిషేకాలు, విశేష హోమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంటకు పూర్ణాహుతి, మహాప్రసాద వితరణ, సాయంత్రం పల్లకీసేవ, భజనలు ఉంటాయని శబరి గిరీశ సేవా సమితి తెలిపింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
తెలంగాణ
చేర్యాలలో వైభవంగా ఆలయ వార్షికోత్సవ పూజలు


