హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పగిలిన తాగునీటి పైప్‌లైన్.. నీరు వృథా

వరంగల్ కాశిబుగ్గలోని ప్రధాన రహదారిలో గ్యాస్ పైప్‌లైన్ పనుల సందర్భంగా తిలక్‌ రోడ్ ప్రాంతానికి చెందిన తాగునీటి ప్రధాన పైప్‌లైన్ దెబ్బతింది. దీంతో పెద్దఎత్తున మంచినీరు వృథాగా పోతోంది. పైప్‌లైన్ మరమ్మతు ఆలస్యం కావడంతో తాగునీటి సరఫరాపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.