హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారి మరమ్మతు పనులు ప్రారంభం

SDPT: బెజ్జంకి మండలం గూడెం గ్రామం నుంచి గుంటూరుపల్లెకు వెళ్లే రహదారిపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన గ్రామ సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో గుంతల్లో మొరం పోసి రహదారిని తాత్కాలికంగా సరిచేశారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.