KMR: మెదక్ జిల్లాకు చెందిన మూడ్ కేస్లీ తన భర్త దస్రియ్యతో కలిసి సోమవారం గోపాల్‌పేట వచ్చింది. ఎస్సై భార్గవ్ గౌడ్ వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తులు దంపతులను రూ.పది నోటు ఇచ్చి దాన్ని నలిపి వాసన చూడమని చెప్పారు. దీంతో దంపతులు అలా చేయగానే వారు మత్తులోకి జారుకోవడంతో కేస్లీ వద్ద ఉన్న రూ.20 వేల నగదు, 12 తులాల వెండి గొలుసును ఎత్తుకెళ్లినట్లు ఆయన ఇవాళ తెలిపారు.
తెలంగాణ
రూ.10 నోటు ఇచ్చి.. రూ.20 వేల అపహరణ


