హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాగునీటి కోసం రోడ్డెక్కిన తండా ప్రజలు

VKB: పెద్దేముల్ మండలంలోని కందనెల్లి తండాలో గత 15 రోజులుగా తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం తండావాసులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. పలుమార్లు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.