హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అధ్వానంగా కౌటాల-ముత్తంపేట ప్రధాన రహదారి

ASF: కౌటాల మండల కేంద్రం నుంచి ముత్తంపేటకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై అడుగడుగునా గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు గుంతల్లో నిలిచి ప్రమాదకరంగా మారుతోంది. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటోందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేయించాలన్నారు.