హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట

సత్యసాయి: కదిరి పట్టణం 30వ వార్డులో శిల్పా నర్సింగ్‌హోమ్ సమీపం నుంచి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ “పేదల సేవలో” కార్యక్రమాన్ని ప్రారంభించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను అందజేశారు. వారి కుటుంబ పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై లబ్ధిదారుల స్పందనను తెలుసుకున్నారు.