కోనసీమ: కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన గొటేటి రామమూర్తి కుటుంబానికి మంగళవారం తొలి పింఛన్ అందజేశారు. రామమూర్తి దీనస్థితిపై సోషల్ మీడియాలో వచ్చిన కథనానికి స్పందించిన మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఈ చర్య చేపట్టారు. రూ.15 వేల తొలి పింఛన్‌ను కొత్తపేట ఆర్డీఓ సత్యనారాయణ అందజేశారు. ఎమ్మెల్యే బండారు సతీమణి కమలాదేవి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రామమూర్తి కుటుంబానికి తొలి పింఛన్ అందజేత


