AKP: పాయకరావుపేట మండలం పీఎల్ పురంలో హోం మంత్రి వంగలపూడి అనిత ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకుని పింఛన్లను అందజేశారు. సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పింఛన్లు పంపిణీ చేసిన హోం మంత్రి


