VSP: విశాఖలోని బస్ స్టాపుల్లో RTC బస్సులు ఆగడం లేదు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం విద్యార్థులు స్కూళ్లకు.. ఉద్యోగులు విధులకు వెళ్లి వచ్చే సమయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కొన్నిసార్లు స్టాప్‌కు దూరంగా ఆపడంతో ప్రయాణికులు పరుగులు పెడుతున్నారు. దీనిపై వార్తలు రావడంతో అధికారులు స్పందించి డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చినా వారి తీరు మారడం లేదని విశాఖ వాసులు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
మారని తీరు.. ఆగని RTC బస్సులు


