హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రధాన రహదారుల పరిశుభ్రతపై నిర్లక్ష్యం'

WGL: గ్రేటర్ వరంగల్ ప్రధాన రహదారులు, డివైడర్లు, కూడళ్ల పరిశుభ్రతలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న హెచ్చరించారు. మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించిన ఆయన, డివైడర్లపై చెత్త, మట్టి, ఎండిన ఆకులు, చెట్ల కొమ్మలు పేరుకుపోకుండా నిత్యం శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.