హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయచోటిలో పోలీసులపై యువకుడి దాడి

అన్నమయ్య: రాయచోటిలో ఘర్షణ సమాచారం అందడంతో వెళ్లిన పోలీసులకు ఓ యువకుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా బైక్‌ను అదుపుతప్పేలా చేయడంతో కానిస్టేబుల్‌ డీబీ వలికి తీవ్ర గాయాలయ్యాయి. కాలికి గాయం కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.