హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంకిపాడులో పోలీసుల కాల్పులు..!

కృష్ణా: కంకిపాడు (M) కోమటికుంటలాకుల డొంకరోడ్డులో పోలీసులపై కత్తి, రాళ్లతో దాడికి పాల్పడిన నిందితుడు అవినాష్‌పై కంకిపాడు CI మంగళవారం కాల్పులు జరిపారు. కాళ్లకు గాయాలైన అతడిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిన్న నల్లజర్లలో పోలీసులను గాయపరిచి పరారైన అవినాష్ కోసం గన్నవరం, కంకిపాడు CIలు గాలిస్తుండగా ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.