హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రేమకు పెద్దల నిరాకరణ.. యువతి ఆత్మహత్య

SRD: పటాన్‌చెరు జేపీ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూ తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో వైష్ణవి(23) ఏళ్ల యువతి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడగా.. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.