హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనగామ రైతులకు ఉచితంగా ఆగ్రో ఫారెస్ట్‌ మొక్కలు

JN: జిల్లాలోని రైతులకు ఆగ్రో ఫారెస్ట్‌ మొక్కలను ఉచితంగా అందిస్తున్నట్లు ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి తెలిపారు. ములుగు ఉద్యాన నర్సరీ, సిద్దిపేట జిల్లా నుంచి ఒక్కో రైతుకు 160 మొక్కలు అందించనున్నట్లు పేర్కొన్నారు. శ్రీగంధం, మహాగని, టేకు, మునగ తదితర రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.