హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గుడివాడలో లబ్ధిదారుల ఇళ్లకే పింఛన్

కృష్ణా: గుడివాడ 8వ వార్డు పెద్దవీధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూ. 4 వేల పింఛన్ నగదును అందించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గుడివాడ అభివృద్ధికి త్వరలో రూ. 50 కోట్లతో రోడ్ల పనులు చేపడతామని తెలిపారు.