హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారుల నిర్లక్ష్యం.. రైతుకు తిప్పలు

PPM: జియ్యమ్మవలస, వట్టిగెడ్డ జలాశయ పరిధి ప్రతాప సాగరం చెరువు దిగువన ఆక్విడెక్ట్ పాడైంది. దీంతో లక్ష్మీ పురం, పరజపాడు గదబవలస ఆయకట్టు రైతులు సాగునీటికి ఇబ్బంది పడ్డారు. చేసేది లేక శ్రమదానంతో కాలువ పూడిక తీశారు. అక్విడెక్ట్ పైపులు, ఇసుక బస్తాలు వేసి నీరు వచ్చేలా పనులు చేసుకున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.