హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వేట్రాక్‌పై వ్యక్తి ఆత్మహత్య

ATP: గుంతకల్లులో స్థానిక రోటరీ స్కూల్ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద శ్రీనివాసులు(40) అనే వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు పట్టణంలోని హనుమేష్ నగర్లో నివాసముంటూ, హోటల్లో పని చేస్తూ జీవనం సాగించేవాడు, తనకు ఇంకా పెళ్లి కావడం లేదని మనస్తాపంతో సోమవారం గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.