GDWL: రాజోలి మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. వడ్డేపల్లి మండలం మద్దూరుకు చెందిన ట్రాక్టర్ వెళ్తుండగా ట్రాలీ లింక్ రాడ్డు అకస్మాత్తుగా విరిగింది. దీంతో ట్రాలీ సుమారు 100 మీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లి బోల్తా పడింది. రద్దీగా ఉండే మార్గంలో ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
తెలంగాణ
ట్రాలీ లింక్ రాడ్డు విరిగి బోల్తా.. తప్పిన ప్రమాదం


