హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల టాయిలెట్ల తలుపులు ధ్వంసం

BHPL: గణపురం మండలంలోని మైలారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మరుగుదొడ్ల తలుపులను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గుర్తించి సర్పంచి సమ్మయ్యనాయక్‌కు సమాచారం అందించారు. అనంతరం ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.