హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ!

NDL: ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం ఉదయం 4:30 నుంచి రాత్రి 11:48 గంటల వరకు 35,002 మంది స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉచిత క్యూలైన్‌లో 24,283 మంది దర్శనం చేసుకున్నారు. 6,093 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు.