హైదరాబాద్: 28°C
తెలంగాణ

హోటళ్లలో మరిగిన నూనె.. ఆరోగ్యానికి ప్రమాదం

HYDలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాదాపు 74 హోటళ్లలో నిర్వహించిన తనిఖీల్లో ఆందోళనకర విషయాలు వెలుగుచూశాయి. కొన్ని హోటళ్లలో నెలల తరబడి నూనెను పదేపదే మరిగించి వాడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి నూనె వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని FSO పవన్ కుమార్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.