హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ ఐడియా.. MP రూ.కోటి విరాళం..!

నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో వసతుల కల్పనకు కలెక్టర్ హిమాన్షు శుక్లా 'విద్య-వసతి-వికాసం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం MP వేమిరెడ్డి రూ.కోటి విరాళం అందజేయగా.. ఈ నిధులతో 155 హాస్టళ్లకు కంప్యూటర్లు కొనుగోలు చేస్తామని కలెక్టర్ చెప్పారు. ఇప్పటి వరకు రూ.5 కోట్ల విరాళాలు వచ్చాయని తెలిపారు.