హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ

CTR: చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 12వ వార్డు అరుల్ పురం గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావుతో కలిసి ఇవాళ ఉదయం పంపిణీ చేశారు. స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ నగదు అందజేశారు. పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు.