హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసు నడపాలని విజ్ఞప్తి

నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని కోమటికుంట, దత్తారం, షాయిన్‌పేట గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, గ్రామస్థులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే బస్సు నడపాలని విజ్ఞప్తి చేశారు.