హైదరాబాద్: 28°C
తెలంగాణ

హంద్రీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల అవస్థలు

GDWL: హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ (17028)లో ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉంది. గద్వాల్‌ నుంచి తెల్లవారుజామున 4 నుంచి 6:30 గంటల మధ్య సరైన రైళ్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కర్నూలులోనే రైలు నిండిపోవడంతో గద్వాల్‌లో ఎక్కేవారికి సీట్లు దొరకడం లేదు. అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.