హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తామర పువ్వులతో వినాయకుడికి విశేష అలంకరణ

అన్నమయ్య: మదనపల్లె బాలాజీనగర్‌లోని వినాయకుని ఆలయంలో శ్రావణమాస సంకష్టహర చతుర్థి సందర్భంగా సహస్ర కమల అర్చన నిర్వహించారు. ప్రధాన అర్చకులు రజా స్వామి ఆధ్వర్యంలో స్వామివారిని 1008 తామర పువ్వులతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.