KNR: కరీంనగర్‌లోని SRR ప్రభుత్వ కళాశాలలో బేసిక్ బ్యూటీషియన్ సర్టిఫికెట్ కోర్సు ప్రవేశాల గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ కే.రామకృష్ణ తెలిపారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఈ కోర్సు దోహదపడుతుందన్నారు. ఈనెల 11 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, ఫీజు రూ.2,000 అని తెలిపారు. ఆసక్తిగ వారు కోర్సు కోఆర్డినేటర్ డా. కిరణ్మయిని సంప్రదించాలన్నారు.
తెలంగాణ
బ్యూటీషియన్ కోర్సు దరఖాస్తుల గడువు పొడిగింపు


