మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన రైతు కమ్మరి లింగం కామారెడ్డి జిల్లా రాజంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం రాజంపేటలోని బంధువుల ఇంటికి వెళ్లిన ఆయన, తిరిగి వస్తున్న సమయంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంతో కాట్రియాల గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ
అర్ధరాత్రి యాక్సిడెంట్.. వ్యక్తి మృతి


