హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోతుల బెడద నివారణకు చర్యలు

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం స్పందించింది. సర్పంచ్ బొల్లం శ్రీధర్ ఆధ్వర్యంలో కోతులను పట్టే సిబ్బందిని రప్పించి పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించే చర్యలు ప్రారంభించారు. సమస్య పరిష్కారానికి పంచాయతీ చర్యలు చేపట్టడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ పాలకవర్గాన్ని అభినందించారు.