WGL: గీసుగొండ మండలం ఊకల్ హవేలిలోని శ్రీ నాగసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి మంగళవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు సుదర్శనాచార్యులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని పుట్టలో పాలు పోసి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.
తెలంగాణ
VIDEO: నాగసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు


