GNTR: తన భర్త ట్రెజరీలో 35 ఏళ్ల పాటు సేవలు అందించినా, గత 19 ఏళ్లుగా కుటుంబ పెన్షన్ అందడం లేదని 87 ఏళ్ల రహమతున్నీసా కలెక్టర్ PGRSలో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబమైనా పెన్షన్ కోసం తిరగాల్సి రావడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, రూ. 38.54 లక్షల బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తమన్నారు.
ఆంధ్రప్రదేశ్
19 ఏళ్లుగా అందని పెన్షన్..!


