హైదరాబాద్: 28°C
తెలంగాణ

దిలావర్పూర్‌లో పందుల స్వైర విహారం

NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలో పందుల బారి నుండి కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు. గతంలో అధికారుల సమక్షంలో గ్రామస్తులు గ్రామంలో పందులు తిరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, పందుల పెంపకం దారులకు కోరినప్పటికీ వారు పెడచెవిన పెడుతున్నారు. ఇకనైనా అధికారులు జోక్యం చేసుకొని పందుల బారి నుండి గ్రామస్తులను కాపాడాలని వేడుకుంటున్నారు.