హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సహాయనిధి పేదలకు కొండంత అండ: చిన్నారెడ్డి

WNP: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి 150 మంది లబ్ధిదారులకు రూ.45.31 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఆరోగ్యశ్రీ లేనివారికి సీఎం సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పాలన మంగళవారంతో వెయ్యి రోజులకు చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.