హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

2,091 హెక్టార్ల లక్ష్యం.. 1,200 హెక్టార్లలోనే నాట్లు

ASR: కొయ్యూరు మండలంలో వర్షాభావంతో వరి సాగు తగ్గిందని ఏవో పీ.శివరామ్ ప్రసాద్ తెలిపారు. సాధారణ వరి సాగు విస్తీర్ణం 2,091 హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 1,200 హెక్టార్లలో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. జూన్‌లో 32%, జూలైలో 46%, ఆగస్టులో 73% వర్షపాతం లోటు నమోదైంది. దీంతో 891 హెక్టార్లలో నాట్లు వేసే పరిస్థితి లేదన్నారు. ఈ విస్తీర్ణంలో అపరాలకు సిద్ధం చేశామన్నారు.