హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుంగభద్ర నదిలో మొసలి కలకలం

KRNL: మేళిగనూరు గ్రామం వద్ద తుంగభద్ర నదిలో మొసలి కలకలం రేపింది. నది ఒడ్డున ఉన్న రామలింగేశ్వర ఆలయం వెనకభాగంలో మొసలి కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. మేళిగనూరు ఆలయ పరిసర ప్రాంతాల్లో నదిలో 4నుంచి 5 మొసళ్లు సంచరిస్తున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.