హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటవీ భూమి ఆక్రమణకు యత్నం.. కేసు నమోదు

NZB: తాటిపల్లి అటవీ ప్రాంతంలో 0.36 హెక్టార్ల భూమిని అక్రమంగా దున్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన మొహన్‌పై ఎన్‌క్రోచ్‌మెంట్ కేసు నమోదు చేసినట్లు సిరికొండ ఫారెస్ట్ రేంజ్ అధికారి కే. నర్సింగరావు తెలిపారు. నిందితుడిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. అటవీ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించినా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.